సూర్యాపేట జిల్లా:సూర్యాపేట పట్టణంలో నిర్మిస్తున్న హిందూ శ్మశాన వాటికను సోమవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ వెంకటేశ్వర్లుతో కలిసి సందర్శించారు.శ్మశాన వాటికలో జరుగుతున్న పనులను డీఈ సత్యారావు,ఏఈ సుమంత్ లను అడిగి తెలుసుకున్నారు.
నిర్మాణానికి సంబంధించిన ప్లాన్లను పరిశీలించి మహా ప్రస్థానం పనులు శరవేగంగా జరగడంపై అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరం తరహాలో సూర్యాపేటలో మహాప్రస్థానం నిర్మించడపట్ల ప్రశంసలు కురిపించారు.
త్వరలో మిర్యాలగూడలో కూడా మహాప్రస్థానం నిర్మాణం పనులు చేపట్టనున్నట్టు చెప్పారు.