ఎమ్మెల్యేకు మంద కృష్ణ మాదిగ వినతిపత్రం

సూర్యాపేట జిల్లా:ఎస్ఐ,కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక పరీక్ష కట్ ఆఫ్ మార్కుల విషయంలో జరిగిన అన్యాయాన్ని అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ను కోరారు.ఆదివారం కోదాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలసి వినతిపత్రం అందజేశారు.

 Manda Krishna Madiga Petition To Mla-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోటిఫికేషన్ లో గతంలో అభ్యర్థులకు 80 మార్కులు కటాఫ్ ఉండగా,ఈ నోటిఫికేషన్ లో అధికారులు 20 మార్కులు తగ్గించి 60 మార్కులు కటాఫ్ పెట్టారని,బీసీలకు 70 మార్కులు కటాఫ్ ఉండగా 10 మార్కులు తగ్గించి 60 మార్కులు కటాఫ్ చేశారని,ఎస్సీలకు మాత్రం ఎటువంటి మినహాయింపు లేకుండా గతంలో మాదిరిగా 40 కటాప్ మార్కుల్ ఉంచారని,ఇది ఎస్సీ,ఎస్టీలకు తీరని అన్యాయమని,ఎస్సీ,ఎస్టీ,బీసీలకు కూడా ఓసిల మాదిరిగా గతంలోని కటాఫ్ కు 20 మార్కులు తగ్గించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.అదేవిధంగా గతంలో నోటిఫికేషన్ కు భిన్నంగా డిగ్రీ పాసై ఉండాలనే నిబంధన విధించడం తమ వర్గాలకు నష్టం కలిగిస్తుందని తెలిపారు.

నోటిఫికేషన్ లోని లోపాలను సవరించి రీ నోటిఫికేషన్ ఇచ్చే విధంగా కృషి చేయాలన్నారు.ఎస్సీ,ఎస్టీ,బిసి వర్గాలకు జరిగిన అన్యాయంపై ఎమ్మార్పీఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలకు,మంత్రులకు అన్యాయం జరిగిన ఎస్ఐ అభ్యర్థులతో కలిసి వినతిపత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ,బిసి వర్గాలకు జరిగిన అన్యాయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఏపూరి రాజు మాదిగ,మహాజన సోషలిస్టు పార్టీ నియోజకవర్గ నాయకులు వడ్డేపల్లి కోటేష్,యలమర్తి రాము, కొండపల్లి ఆంజనేయులు,కొత్తపల్లి అంజయ్య,రావి స్నేహలత చౌదరి,ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు కుడుముల శ్రీను,పట్టణ ఉపాధ్యక్షులు సోమపంగు నరేష్,ఏపూరి సత్యరాజు,యలమర్తి ఉపేందర్, సోమపంగు సురేష్,మాతంగి మట్టయ్య,ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు నేలమర్రి శ్రీకాంత్,పోకల గోపి, యలమర్తి వీరబాబు,కలకొండ గోపాలరావు,మంద నరేందర్,యలమర్తి స్వరూప,యలమర్తి కీర్తన,మంద కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube