వ్యవసాయ రంగంపై ప్రభుత్వాల చిన్నచూపు తగదు

సూర్యాపేట జిల్లా:కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగంపై అనుసరిస్తున్న విధానం రైతాంగాన్ని తీవ్రంగా కలచి వేస్తోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ ఆవేదన వ్యక్తం చేశారు.

 Governments' Underestimation Of The Agricultural Sector Is Inappropriate-TeluguStop.com

అందుకోసం నేటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సర్వేలు నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ రంగం వాటి సవాళ్లు అనే అంశంపై జిల్లా కేంద్రంలోని సీతారామ ఫంక్షన్ హాల్లో ఆదివారం రెండవ రోజు జరిగిన విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.

వ్యవసాయ రంగం భవిష్యత్ లో ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రభుత్వాలకు నిర్ణయాత్మకమైన సర్వేలను తెలంగాణ రైతు సంఘం ఆద్వర్యంలో అందించనున్నట్లు వెల్లడించారు.అందుకోసం ఈనెల 7 నుండి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధివిధానాలపై సర్వేలు జరుపనున్నట్లు తెలిపారు.

ముఖ్యoగా రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల అవసరాలకు అనుగుణంగా రైతులు పంటలను వేయలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దీనికి తోడు కల్తీ విత్తనాలు రాష్ట్ర రైతాంగాన్ని తీవ్రంగా నష్ట మిగుల్చుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు ప్రకృతి వైపరీత్యాల వల్లనూ రైతాంగo పీకల్లోతు కష్టాల్లోకి నెట్టబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ రైతుల భవిష్యత్ ఆధారంగా ఉండాలని సూచించారు.

ఇట్టి బడ్జెట్ లో రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రాజెక్టులు,రైతుల రుణాలు,రైతు బంధు,రైతు భీమాలకు పరిగణనలోకి తీసుకుని అధిక ప్రాధాన్యతనిస్తూ పరిగణనలోకి తీసుకుని భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు జరగాలని సూచించారు.దీనితో పాటు రైతు పండించిన ప్రతి పంటకు మద్దతు ధర కల్పించేలా,అది అమలయ్యేలా ఉండాలని డిమాండ్ చేశారు.

ఈ సంధర్భంగా వ్యవసాయ రంగాన్ని నూతనోత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తు రాష్ట్ర కమిటీ పంటకు కనీస మద్దతు ధర చట్టం,ఋణ విమోచన చట్టం,కౌలు రైతు ఋణ అర్హత కార్డుల జారీ,ధరణిలో నెలకొన్న సమస్యల పరిష్కారం,సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వ ప్రాధాన్యత,ప్రకృతి వైపరీత్యాల వల్ల పూర్తిగా నష్టపోయిన పంటకి ఆర్థిక చెల్లిoపులు వంటి ఆరు తీర్మాణాలు ప్రవేశ పెట్టిందని తెలిపారు ఈ సమావేశంలో అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి,రాష్ట్ర అధ్యక్షులు పీ.జంగారెడ్డి,రాష్ట్ర ఉపాధ్యక్షులు మూడ్ శోభన్, మాదినేని రమేష్,బండ శ్రీశైలం,నక్కల యాదవ రెడ్డి,రాష్ట్ర సహాయ కార్యదర్శులు కున్ రెడ్డి నాగిరెడ్డి,నున్న నాగేశ్వరరావు,కున్సోత్ ధర్మా, కుమారస్వామి,బాల్ రెడ్డి,ఎం.శ్రీనివాసులు,మంగ నరసింహ,సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బుర్రి శ్రీరాములు,దండ వెంకట్ రెడ్డి,రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొప్పుల రజిత తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube