సూర్యాపేట జిల్లా:దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్క దళితుడికి దళిత బంధు ద్వారా రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మోతె మండల తహసిల్దార్ కార్యాలయం ముందు కెవిపిఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కెవిపిఎస్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కోట గోపి హాజరై మాట్లాడాతూ జిల్లాలో దరఖాస్తు చేసుకున్న ప్రతీ దళిత కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలన్నారు.దళిత బంధు పేరుతో దళితుల్లో అయోమయం నెలకొందని,ఇందులో రాజకీయ ప్రమేయం ఉండటంతో పథకం పక్కదారి పడుతుందని,కేవలం స్థానిక ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఎంపిక జరగడం వలన నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని అన్నారు.
దళిత బంధు నుండి ఎమ్మెల్యేల అధికారాన్ని తొలగించి అధికారుల పర్యవేక్షణలో అమలు జరిగేలా చూడాలని కోరారు.దళిత బంధును మూడెకరాల భూమి,డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకంలా కాకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని స్థానిక తహశీల్దార్ కు అందజేశారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు ఒగ్గు సైదులు,దుర్గారావు,వీరబాబు, జాన్ వెస్లీ,సుందరయ్య,ఎలయ్య,అలివేలు,విజయ కుమారి,నాగమ్మ,భవాని తదితరులు పాల్గొన్నారు.