ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఎండలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల చాలామంది ప్రజలు చల్లని నీరు త్రాగడానికి ఇష్టపడుతున్నారు.చల్లని నీరు త్రాగితే కడుపులో చల్లగా ఉంటుంది.
ఎందుకంటే చల్లని నీరు లేకుంటే అసలు నీరు త్రాగినట్టు అనిపించదు.అయితే చల్లని నీరు ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని అనేక అనారోగ్య సమస్యలకు చల్లని నీరు కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు.
వేడి నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండవచ్చు అని కూడా చెబుతున్నారు.వేడి నీరు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
ప్రతి రోజు వేడి నీటిని తాగడం అలవాటు చేసుకుంటే మధుమేహం రాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా ఆర్థరైటిస్ సమస్య అదుపులో ఉంటుందని, కీళ్ల నొప్పుల సమస్యలు కొంత మెరకు తగ్గిపోతాయని చెబుతున్నారు.

వేడి నీళ్లు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని ఎప్పటికీ కడుపు సంబంధిత సమస్యలు రావని చెబుతున్నారు.ఇవే కాకుండా గొంతు సమస్యలు రావని, దగ్గు వచ్చే అవకాశం తగ్గుతుంది అని చెబుతున్నారు.అంతేకాకుండా చాలా రకాల చర్మ సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది అని చెబుతున్నారు.

ముఖ్యంగా వేడి నీళ్ళు తాగేవారికి జలుబు కూడా త్వరగా రాదని చెబుతున్నారు.ఈ ఆరోగ్య సమస్యలనుంచి త్వరగా బయటపడాలంటే వేడి నీళ్లను ఒక పద్ధతి ప్రకారం తాగాలి.అయితే ఆ పద్ధతి ప్రకారం మాత్రమే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
వేడి నీళ్లు తాగమన్నారని విపరీతంగా వేడిగా ఉన్న నీటిని తాగకూడదని దానివల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.గోరువెచ్చగా ఉన్న నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిది అని చెబుతున్నారు.
గోరువెచ్చని నీటిని చప్పరిస్తూ తాగాలని సూచిస్తున్నారు.ఉదయం లేవగానే ఒక గ్లాసు ఒకే రోజు కాకుండా ప్రతిరోజు గోరువెచ్చని నీటినీ తాగడం మంచిది.