సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలో వర్గపోరు క్రమక్రమంగా ముదురుతోంది.ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మున్సిపల్ ఛైర్మన్ పై అవిశ్వాసం పెట్టి దాదాపు 13 రోజులైనా అధిష్టానం స్పందించలేదు.దీంతో సిద్ధిపేట కలెక్టర్ కు అవిశ్వాస నోటీసులను ఇచ్చారు కౌన్సిలర్లు.
మరోవైపు అవిశ్వాసంపై స్టే విధించాలని కోరుతూ మున్సిపల్ ఛైర్మన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.అయితే ఇప్పటికే మున్సిపల్ ఛైర్మన్ పై అవిశ్వాసానికి హైకోర్టు స్టే విధించింది.