సూర్యాపేట జిల్లా: విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పిసి)ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా యూఎస్పిసి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ నేతలు ఎం.
సోమయ్య, సిహెచ్.రాములు.
ఎం.కృష్ణారెడ్డి ( Krishna Reddy )మాట్లడుతూ విద్యారంగంలో దీర్ఘకాలికంగా అపరిస్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పీఆర్సీ కమిటీ( PRC Committee )ని వేయాలని,జులై 1,2023 నుండి మధ్యంతర భృతి మంజూరు చేయాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు చేయాలని,పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని,నూతన జాతీయ విద్యా విధానం 2020( New National Education Policy 2020 ) ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉద్యోగులపై భారం పడకుండా ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని,అన్ని యాజమాన్యాల విద్యా సంస్థల్లోని ఉద్యోగ ఉపాధ్యాయులకు నగదు రహిత వైద్యం అందించాలని,రాష్ట్రంలో ఖాళీగున్న ఉపాధ్యాయ, పర్యవేక్షణాధికారుల పోస్టులను పదోన్నతులతో భర్తీ చేసి,అనంతరం ఏర్పడిన ఉపాధ్యాయ ఖాళీల భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు.
కాంటాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు( Outsourcing Employees ) సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని,ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉన్న ఉద్యోగుల, ఉపాధ్యాయుల సప్లమెంటరీ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలోయూఎస్బీసీ నాయకులు ఎన్.సోమయ్య, పి.ముత్తయ్య,ఆర్.లింగయ్య,ఎస్.అనిల్ కుమార్,సిహెచ్.భిక్షం,పి.వెంకటేశ్వరరావు,పి.
శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు