సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయండి

సూర్యాపేట జిల్లా:ఈనెల 22న సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా మొదటి ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ప్రజాపంథా సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక పిలుపునిచ్చారు.

శనివారం జిల్లా కేంద్రంలోని విక్రమ్ భవన్లో ఆవిర్భావ దినోత్సవ కరపత్రాన్ని ఆమె ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనునిత్యం ప్రజల మధ్యన ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారణకై పోరాడాలంటే జనతా ప్రజాస్వామిక విప్లవ అవసరమని,ఆ దారిలో పయనించాలని 2022 ఫిబ్రవరి 22న ప్రజాపంథా సరికొత్త విధానంతో ఆవిర్భవించిందన్నారు.ప్రజలకు గత సిద్ధాంతాలతో అందుబాటులో లేకుండా వివిధ పేర్లతోటి ప్రజలను మోసం చేస్తూ కాల గమనంలో కానరాకుండా పోతున్న వివిధ విప్లవ పార్టీల దారిలో కాకుండా నూతన విధానం ఆలోచించి నూతనత్వంతోటి అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలే అజెండాగా వాటిని పరిష్కరించేంతవరకు అనునిత్యం ప్రజా పోరాటాలు నిర్వహించి, జనతా ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించేందుకు సరికొత్త విధానం, నినాదంతో ఏర్పడ్డ పార్టీకి ప్రజలు తమ సహయ సహకారాలు అందించాలన్నారు.

రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలో ఒక నూతన అధ్యాయము సృష్టించే దిశగా ప్రజాపంథా అడుగులేస్తూ ముందుకు సాగుతుందని అన్నారు.కాబట్టి పార్టీ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టు.యు జిల్లా కార్యదర్శి రామోజీ, పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి,ప్రజాపంథా పట్టణ కార్యదర్శి గులాం, నాయకులు జీవన్,వాజిద్, సైదులు,సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

తాజా వార్తలు