రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మలోత్ తేజ్యా నాయక్ ( 46 ) గుండెపోటు తో ప్రస్తుతం నివాసమై ఉంటున్న ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున ఇంటి వద్ద గుండెనొప్పి రావటం అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయి మరణించారు.అనంతరం మండల కేంద్రములోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తేజ్యానాయక్ ను తరలించగా వైద్యులు మరణించి ఉన్నాడని ధృవీకరించారు.
అతని బార్య, అతని సోదరుడు బంధుమిత్రులు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు, దీంతో ఎర్ర గడ్డ తండా లో విషాదం అలుముకుంది, అతని మృతదేహాన్ని అతని స్వగ్రామమైన వీర్నపల్లి మండలం రంగంపేట ఎర్రగడ్డ తండా గ్రామ పంచాయతీ కీ తరలించారు.తేజ్యా నాయక్ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గత కొంతకాలంగా నివాసమై ఉంటూ చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నారు.
అతనికి భార్య భారతి, కుమారుడు గంగాధర్, కూతురు సరిత లున్నారు.







