రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రక్తదాత వంగ గిరిధర్ రెడ్డి 48 సార్లు రక్తదానం చేసి జాతీయ అవార్డుకు ఎంపికై ఈనెల 14న హైదరాబాదులో త్యాగరాయ గాన సభలో మహానంది పురస్కారం అందుకున్న సందర్భంగా శనివారం మిత్రులు సింగిల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి,
ఓం సాయి జనరల్ స్టోర్ సాన రవి, కార్వింగ్ కళాకారుడు శ్యామంతుల అనిల్ కలిసి శాలువా కప్పి సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు ఎడ్ల సందీప్, పందిర్ల పరుశురాం గౌడ్, నేవూరి పద్మా రెడ్డి, రఫీక్, బొమ్మ కంటి అశోక్ గుప్తా పాల్గొన్నారు.