పాలకవీడు మండలం మీగడం పహాడ్ తండా( Pahad Thanda )లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఇళ్లు దగ్ధమై నిరాశ్రయులైన గిరిజన కుటుంబానికి స్థానిక ఎంపిపి గోపాల్,గ్రామస్తులు అండగా నిలిచి శనివారం రూ.60 వేల ఆర్ధిక సహాయం అందజేశారు. శివరాత్రి పండగ( Shivaratri ) సందర్భంగా గ్రామానికి చెందిన భూక్య బాబు కుటుంబ సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్ లోని కోటప్పకొండ శివాలయానికి వెళ్ళారు.శుక్రవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో షాట్ సర్క్యూట్( Short Circuit ) లేదా ఇంకేమైనా కారణమో తెలియదు కానీ,ఇంట్లో మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది.
ఈ అగ్నిప్రమాదం( Fire Accident )లో ఇంట్లోని వస్తువులు,నిత్యావసరాలు,ధాన్యం,బీరువా వంటి సుమారు 2 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగింది.అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి కట్టు బట్టలతో మిగిలిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని భూక్యా బాబు దంపతులు వేడుకున్నారు.
శనివారం హుజూర్ నగర్( Huzurnagar ) లో పలు అభివృద్ధి పనులలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లడంతో ఇందిరమ్మ గృహాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి జిల్లా కలెక్టర్ ని ఆదేశించినట్లు ఎంపీపీ గోపాల్ తెలిపారు.