మన ఊరు-మనబడి అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే

సూర్యాపేట జిల్లా:తిరుమలగిరి పట్టణంలోని శుభమస్తు పంక్షన్ హాల్లో తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి మనఊరు-మనబడి అవగాహన సదస్సుకు ముఖ్యాతిధిగా తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ హాజరయ్యారు.

 Mla Who Participated In Our Uru-manabadi Awareness Conference-TeluguStop.com

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనఊరు-మనబడి ఒక అధ్బుతమైన పథకం,దీనిని వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్ని పాఠశాలలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సంకల్పించారని చెప్పారు.ఉపాధ్యాయులు, అధికారులు,ప్రజాప్రతినిధులు సహకరిస్తే పేద పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో చదివే అవకాశం కలుగుతుందని అన్నారు.

కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, 7,289 కోట్లు మనఊరు-మనబడి కోసం మంజూరయ్యాయని,ఈ నిధులు సక్రమంగా వినియోగిస్తే విద్యా వ్యవస్థలో మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈనెల ఎనిమిదిన ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తిలో మనఊరు-మనబడి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలిపారు.

మనఊరు-మనబడి పథకానికి ఎంపిక కాబడిన పాఠశాలల మరమ్మతులు చేపట్టాలని కోరారు.వచ్చే విద్యాసంవత్సరం కల్లా మనఊరు-మనబడికి పాఠశాలలను సిద్దం చేయాలని సూచించారు.

మనఊరు-మనబడి కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పిచైర్పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్ రావు,కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి,జిల్లా రైతు బంధు సమితి కోఆర్డినేటర్ ఎస్ఏ.

రజాక్, నల్లగొండ డీఈఓ బి.భిక్షపతి,యాదాద్రి భువనగిరి డీఈఓ కె.నర్సింహ,సూర్యాపేట డీఈఓ కె.అశోక్ మరియు మార్కెట్ చైర్మన్లు,మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు,జెడ్పీటిసిలు,పిఏసీఎస్ చైర్మన్లు,సర్పంచ్ లు ఎంపీటీసీలు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంఎస్ చైర్మన్లు,ప్రజాప్రతినిధులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube