తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.హైపర్ ఆది తన పంచ్ లతో ప్రేక్షకులను, జడ్జీలను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు.
జబర్దస్త్ షోలో జడ్జిని మొదలుకొని యాంకర్ వరకు ప్రతి ఒక్కరి ని కవర్ చేస్తూ అందరి పై పంచులు వేస్తూ ఉంటాడు.జబర్దస్త్ లో కేవలం హైపర్ ఆది స్కిట్ కోసం చూసే వారు ఉన్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఇకపోతే ఇది ఇలా ఉంటే హైపర్ ఆది గత రెండు వారాలుగా ఇటు ఢీ షోలో కానీ అటు జబర్దస్త్ లో కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీ లో కానీ కనిపించడం లేదు.
హైపర్ ఆది కనిపించకపోయేసరికి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు అని అందరూ అనుకున్నారు.
కానీ తాజాగా బుధవారం జరిగిన డీ షో లో చివరిలో ఎంట్రీ ఇచ్చాడు.పిల్లలతో కలసి డాన్స్ స్టెప్పులు వేస్తూ సందడి చేశాడు.
హైపర్ ఆది ఎంట్రీ ఇవ్వడంతో అఖిల్ మాత్రం దేవుడా ఇప్పటివరకు హ్యాపీ గానే ఉన్నాను ఇప్పుడు హైపర్ ఆది వచ్చేసాడు అని అనగానే.అప్పుడు ప్రదీప్ నిజమే నిన్ను ఏడిపించే మొగుడు ఇంటికి ఇవ్వగానే నీ పేస్ మాడిపోయింది అని అన్నాడు.
ఇక ఎప్పటిలాగే హైపర్ ఆది వచ్చే వారం ఎపిసోడ్ లో అందరినీ తన పంచులతో కడుపుబ్బా నవ్వించాడు.
అందుకు సంబంధించిన ప్రోమో కూడా వైరల్ అయ్యింది.అదేవిధంగా శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చాడు.మహిళా దినోత్సవం సందర్భంగా కంటెస్టెంట్ లు వారి తల్లులను తీసుకువచ్చి పాదాభిషేకం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సుజాత కామెడీ చేయబోగా అమ్మా నువ్వు రాకేష్ ఫింగర్ లో రింగు పెట్టు కానీ మా కామెడీ లో ఎంట్రీ ఇవ్వకు అంటూ హైపర్ ఆది పంచ్ వేస్తాడు.హైపర్ ఆది రీఎంట్రీ తో అతని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
హైపర్ ఆది ఒకవైపు ఢీ, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, మధ్య మధ్యలో సినిమా అవకాశాలు, అదేవిధంగా పండుగ ఈవెంట్ లతో బాగానే సంపాదిస్తున్నాడు.