సూర్యాపేట జిల్లా:గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాలని, టిఎస్పీఎస్సికి నూతన కమిటీని నియమించాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ చేపట్టిన అమరణ నిరహార దీక్షకు సంఘీభావంగా,ఆర్ఎస్పీ అక్రమంగా అరెస్ట్ చేసి దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కోదాడ పట్టణంలో సామాజిక ఉద్యకారుడు కొల్లు వెంకటేశ్వరరావు తన స్వగృహంలో నల్ల దుస్తులు ధరించి దీక్షకు దిగారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఎస్పీఎస్పి వైఫల్యాలపై చేస్తున్న ప్రజా ఉద్యమాలను అప్రజాస్వామికంగా పోలీస్ బలగాలతో కేసీఆర్ ప్రభుత్వ అణచివేయడం దారుణమన్నారు.గ్రూపు1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయడమే కాకుండా లీకేజీలపై సీబీఐతో విచారణ జరపాలి డిమాండ్ చేశారు.
తాజా వార్తలు