సూర్యాపేట జిల్లా:వరి పంటలో పొట్ట దశలో ఎఫ్ఎంసి కొరాజన్ ఎకరానికి 60 ఎం ఎల్ పిచికారి చేసుకోవటం ద్వారా తెల్ల కంకులు లేదా ఊసతిరగడం రాకుండా నివారించి మంచి దిగుబడులు పొందవచ్చని ఎఫ్ఎంసీ రీజినల్ మేనేజర్ ప్రసన్న సూచించారు.శనివారం గరిడేపల్లి మండలం అగ్రహారం గ్రామంలో నిర్వహించిన కొరాజన్ క్షేత్ర ప్రదర్శన కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు నివారణ అంశాలను వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొరాజన్ వరిలో మొగి పురుగు మరియు ఆకు చుట్టు పురుగులను నివారించడంతో పాటు,పోటాకు చివరి వరకు ఆరోగ్యంగా, ఆకుపచ్చగా ఉండేటట్లు చేయడం ద్వారా కంకి పూర్తిగా నిండి,అధిక దిగుబడులకు పునాది వేస్తుందన్నారు.ఎఫ్ఎంసి లెజెండ్ వరిలో ఎకరానికి 48 గ్రాములు పిచికారీ చేసుకోవడం వలన వరిలో గింజ రంగు,నాణ్యత పెరగడంతో పాటు,అధిక దిగుబడులు పొందడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 180 మంది రైతులు హాజరు కాగా,మిర్యాలగూడ మార్కెటింగ్ ఇగ్నీషన్ ఎక్జిక్యూటివ్ శ్రీనివాస్,సేల్స్ ఆఫీసర్ అన్వర్,డీలర్లు పాల్గొన్నారు.