మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే

సూర్యాపేట జిల్లా: నూతనకల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం సావిత్రిభాయి ఫూలే 194 వ,జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వం సావిత్రి భాయి ఫూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిన నేపథ్యంలో ఆమె చిత్ర పపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

 The First Woman Teacher Was Savitribai Phule, First Woman Teacher ,savitribai Ph-TeluguStop.com

ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మహిళల అభ్యుదయం కోసం అహర్నిశలు శ్రమించిన ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం సరైన గుర్తింపునిచ్చిందని, ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందన్నారు.

ప్రతి మహిళా గర్వపడే విధంగా ఆమె జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ నాయకులు దరిపెల్లి వీరన్న, నియోజకవర్గ సేవాదళ్ అధ్యక్షుడు పాల్వాయి నాగరాజు,యువజన కాంగ్రెస్ మండల అద్యక్షుడు పసుల అశోక్, మండల కాంగ్రెస్ నాయకులు ఇరుగు కిరణ్, పగిళ్ళ అశోక్ రెడ్డి, సాబాది వాసుదేవరెడ్డి, చురకంటి చంద్రారెడ్డి, బంటు బద్రీ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube