నల్గొండ జిల్లా:రాష్ట్ర వ్యాప్తంగా డార్విన్ జీవపరిణామ సిద్ధాంత( Darwin’s theory ) ప్రచారంలో భాగంగా సదస్సులు నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక తెలంగాణ కమిటీ నిర్ణయించిందని, ఇటీవల 2023-24 విద్యా సంవత్సరానికి జీవశాస్త్రం నుండి డార్విన్ జీవపరిణామ సిద్ధాంతన్ని ఈఆర్టి తొలగిండం విద్యార్థులకు తీవ్ర నష్టమని,సోమవారం ముగిసిన రాష్ట్ర వార్షిక సభలో జేవివి ఏక్రీవంగా తీర్మానం చేసిందని జెవివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.కోయ వెంకటేశ్వరరావు ( Dr.Koya Venkateswara Rao )అన్నారు.జీవ శాస్త్రములో వెన్నుముకైన పరిణామ సిద్దాంతాన్ని 10వ తరగతిలో ఉన్న సారాంశం నుండి తొలగించడం వల్ల విద్యార్థులకు జరిగే నష్ట నివారణ చర్యలో భాగంగా తాము రాష్ట్ర వ్యాప్తంగా అనేక పాఠశాలలో, కళాశాలల్లో రాబోయే 2,3 నెలల కాలంలో 1000 పైగా సదస్సులు నిర్వహించి నష్ట నివారణ చర్యలు తీసుకోనున్నట్లు శ్రీనాథ్( Srinath ) ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1500 పైగా పాఠశాలలో సైన్స్ క్లబ్స్ ఏర్పాట్లు చేస్తామన్నారు.మహారాష్ట్ర,బీహార్ రాష్ట్రాల వలే మన రాష్ట్రంలో కూడా మూఢ నమ్మకల నిరోధక చట్టం తీసుకురావాలని వార్షిక సభ తీర్మానం ఏకగ్రీవకంగా ఆమోదించిందన్నారు.
ఈ వార్షిక సభలలో 33 జిల్లాల నుంచి ఎంపికైన ప్రతినిధులు జేవివి రాష్ట్ర నాయకులు అనేక మంది మేధావులు పాల్గొన్నారని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో జేవివి రాష్ట్ర నాయకులు వరప్రసాద్, కార్యదర్శి వెంకటరమణ రెడ్డి,జిల్లా అధ్యక్షులు వదిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అమరయ్య తదితులు పాల్గొన్నారు.