సూర్యాపేట జిల్లా:అందరిలా కాకుండా కొందరు వినూత్నంగా ఆలోచిస్తారు.అలాంటి వారే ప్రప్రంచం దృష్టిని ఆకర్షించిస్తారు.
ఆ కోవకు చెందిన ఇద్దరు వ్యక్తుల ఆలోచనే ఇప్పుడు మనం చూడబోయే వింత హోటల్ విశేషాలు.వివరాల్లోకి వెళితే…కోదాడ రూరల్ మండలం చిమిర్యాల క్రాస్ రోడ్ లో చూడటానికి లారీ మాదిరిగా కనిపించే హోటల్ ప్రజలను,ముఖ్యంగా భోజన ప్రియులను విశేషంగా ఆకర్షిస్తుంది.
ఆంధ్ర ప్రాంతానికి చెందిన జగ్గయ్యపేట వాసి శివ అతని స్నేహితుడు యశ్వంత్ ఇరువురు వినూత్నమైన ఆలోచనతో సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల క్రాస్ రోడ్ లో ప్రజల సౌకర్యార్థం లారీ టాప్‌పై ఐటిసి హోటల్ ఏర్పాటు చేశారు.నూతన మోడల్ లో హోటల్ ఉండటంతో పలు గ్రామాల ప్రజలు హోటల్ ను ఆసక్తిగా తిలకిస్తున్నారు.
ప్రజలను ఆకర్షించేందుకు ఈ విధమైన నూతన ఒరవడి తో హోటల్ ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.