పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు.ఈయన ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో ముందుగా రిలీజ్ కాబోతున్న సినిమా ”ఆదిపురుష్”( Adipurush ).
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది.భూషణ్ కుమార్, ఓం రౌత్, రాజేష్ మోహనన్, కృష్ణ కుమార్ నిర్మించిన ఈ సినిమా జూన్ 16న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.
మరి ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మేకర్స్ సైతం సిద్ధం అయ్యి గత కొన్ని రోజులుగా వరుసగా పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు.ఇక ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్( Theatrical trailer ) రిలీజ్ చేసేందుకు సమయం ఆసన్నమైంది.కొన్ని రోజులుగా ఈ సినిమా ట్రైలర్ గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి.మరి ఎట్టకేలకు ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు.మే 8న అంటే ఈ రోజు సాయంత్రం 4.20 గంటలకు హైదరాబాద్ లోని AMB సినిమాస్ లో ప్రదర్శించనున్నారు.మొత్తం ఈ ట్రైలర్ 70కి పైగానే దేశాల్లో ప్రదర్శించనుండగా రేపటి నుండి యూట్యూబ్ లో అందుబాటులో ఉండబోతుంది.తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొంత మంది అభిమానుల మధ్య ప్రత్యేక స్క్రీనింగ్ లో ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా టీమ్ కృతి సనన్ ( Kriti Sanon ), డైరెక్టర్ ఓం రౌత్ ( Om Raut ), ఇతర టీమ్ సభ్యులు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు.ఇక ఇప్పుడు తాజాగా అందుతున్న క్రేజీ అప్డేట్ ప్రకారం ఈ ఈవెంట్ లో ప్రభాస్ కూడా పాల్గొన బోతున్నాడు అని తెలుస్తుంది.ఇది విని డార్లింగ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా ట్రైలర్ ఆకట్టు కుంటేనే సినిమాకు మరింత హైప్ పెరుగుతుంది.మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.