మిల్లుల్లో జరుగుతున్న అక్రమాలలో మంత్రి ప్రమేయం లేదా...?

సూర్యాపేట జిల్లా:2014 నుండి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళలో జరుగుతున్న అవినీతిలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రమేయం లేకపోతే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిల్లర్ల అక్రమాలపై న్యాయ పోరాటానికి బీజేపీ సిద్దంగా ఉందన్నారు.

 Minister Is Not Involved In The Irregularities Happening In The Mills...?-TeluguStop.com

జిల్లాలో ఐకేపి కేంద్రాల ద్వారా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయకుండా నకిలీ ట్రాక్ షీట్స్ సృష్టించి వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని మరోసారి ఆరోపించారు.జిల్లాలో ధాన్యం అక్రమాలపై కలెక్టర్,ఎస్పీలతో కూడిన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన మంత్రి జగదీష్ రెడ్డి విచారణ వివరాలు ఎందుకు బయటపెట్టలేదో తేల్చాలని ప్రశ్నించారు.

సి‌ఎం‌ఆర్ అక్రమాలలో జిల్లా అధికారులకు వాటాలు ఉన్నాయని, ప్రభుత్వ నిబంధనల పరంగా లేవీ ఇవ్వని మిల్లర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్న నిబంధన ఉన్నప్పటికి,వీటిలో రాజకీయ పలుకుబడి ఉన్న మిల్లులకే ఎలాంటి నామ్స్ పాటించకుండా తిరిగి ధాన్యం కేటాయించారని పేర్కొన్నారు.ధాన్యం కేటాయింపుల వెనుక జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి,తుంగతుర్తి ఎమెల్యే గాదరి కిషోర్ హస్తం ఉందన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ఆహార పాలసీలతో రైతులకు మద్దతు ధర లబిస్తుందని,దీనితో 30దేశాలకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి భారతదేశం వెల్లిందని తెలిపారు.విదేశీ విధాన నిర్ణయంతో పత్తి రైతుకు రికార్డ్ స్థాయీలో మద్దతు ధర దక్కుతుందని అన్నారు.

మునుగోడుతో సెమీ ఫైనల్ ముగిసిందని,ఇక ఫైనల్ లో అవినీతి,కుటుంబ పాలన,టి‌ఆర్‌ఎస్ అరాచకాలే భారతీయ పార్టీకి ప్రధాన అస్త్రాలుగా మారి అధికారంలోకి వచ్చేలా చేస్తాయని జోస్యం చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube