సూర్యాపేట జిల్లా:ఇటీవల యువత అత్యంత వేగంగా గంజాయి ( Marijuana )మత్తుకు అలవాటుపడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని సూర్యాపేట నుండి గంజాయిని తరికొట్టాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జ్ ధర్మార్జున్(Dharmarjun ) పిలుపునిచ్చారు.తన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన విద్యార్థి,యువజన సమితి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వివిధ కారణాల రీత్యా విద్యార్థులు,యువకులు, దుర్వ్యసనాలకు అలవాటు పడుతున్నారని,వారికి గంజాయి వల్ల జరిగే ప్రమాదాన్ని వివరించి చెబుతూ చైతన్య వంతులను చేయాల్సిన బాధ్యత విద్యార్థి, యువజన సంఘాలదేనని అన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో కళాశాలలు ఎక్కువ మొత్తంలో ఉండడం వివిధ జిల్లాలకు కూడలిగా పట్టణం ఉండడంతో విద్యార్దులను టార్గెట్ చేస్తూ గంజాయి వ్యాపారులు అడ్డదారుల్లో సులువుగా విచ్చలవిడిగా గంజాయి రవాణా చేస్తున్నారన్నారు.
ఒకవైపు పోలీస్ శాఖ మరొకవైపు సామాజిక ప్రజాస్వామిక విద్యార్థి,యువజన సంఘాలు సమన్వయంతో గంజాయిని అరికట్టడానికికృషి చేయాల్సి ఉందన్నారు.
జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఆగస్టు 6వ,తేదీ నుండి గంజాయికి వ్యతిరేకంగా సెమీనార్లు, సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు.గంజాయికి బానిసలు కావొద్దు అంటూ విద్యార్థి,యువజన సమితి రూపొందించిన పోస్టర్లు ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా పార్టీ నాయకులు,పలువురు న్యాయవాదులు,డాక్టర్లు, ప్రజాసంఘాల నాయకులు ధర్మార్జున్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్,జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు తండు నాగరాజు,లీగల్ సెల్ జిల్లా కోకన్వీనర్లు వీరేష్ నాయక్, భాషబోయిన వేణు, విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని వినయ్,రాష్ట్రీయ విద్యార్థి సమితి రాష్ట్ర కన్వీనర్ సందీప్ గౌడ్,ఎస్టీ సెల్ నాయకులు సతీష్,లక్క పక్క నవీన్,యాకూబ్ రెడ్డి,సతీష్,చందు,మురళి ఇట్టమల్ల శ్రీనివాస్,మంగు నాయక్,లోకేష్,అనిల్ తదితరులు పాల్గొన్నారు.