సూర్యాపేట జిల్లా:అక్షర ఫౌండేషన్ సూర్యాపేట ఆధ్వర్యంలో నక్షత్ర హాస్పిటల్ హైదరాబాద్,జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూపు హైదరాబాద్,స్వశోధన్ ట్రస్ట్ హైదరాబాద్ వారి సౌజన్యంతో అక్షర ఉగాది వేడుకలు 20-03-2023 సోమవారం సూర్యాపేటలో నిర్వహిస్తున్నట్లు అక్షర ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ యాస రాంకుమార్ రెడ్డి తెలిపారు.సంస్థ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేడుకలలో కవిసమ్మేళనం, పంచాంగ శ్రవణం,ఉగాది పురస్కారం,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
అక్షర ఉగాది వేడుకల్లో భాగంగా సూర్యాపేట జిల్లాకు చెందిన అన్ని శాఖలలోని ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామాలలోని వృత్తుల వారు,కళాకారులు మరియు సామాజిక రంగాలలో నిష్ణాతులైన, విశేష సేవలు అందిస్తున్న వారు పురస్కారం కోసం దరఖాస్తు చేయాలని తెలిపారు.దరఖాస్తులను [email protected] కు మెయిల్ ద్వారా లేదా 7036259911/22 నంబర్లకు వాట్సాప్ ద్వారా తేదీ.17-03-2023 లోపు అందజేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ఉప్పు నాగయ్య, జనార్థనాచారి,రుద్రంగి కాళిదాసు,పాపయ్య, వీరాసింగ్,వెంకట్ రెడ్డి, తిరుమలరెడ్డి, ఉపేంద్రాచారి, హనుమాచారి, అప్పారావు,నజీర్ భాషా తదితరులు పాల్గొన్నారు.