సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం బూర్గులతండా గ్రామానికి చెందిన మాలోతు తేజ మంగళవారం ప్రకటించిన గ్రూపు-2 ఫలితాలలో జనరల్ కేటగిరిలో 512వ ర్యాంక్, ఎస్టీ కేటగిరిలో 20వ ర్యాంక్ సాధించారు.
గతంలో రైల్వేలో రెండు ఉద్యోగాలు సాధించాడు.
ప్రస్తుతం ఎస్ఎస్సీ సిజిఎల్ లో ఉద్యోగం చేస్తున్న అతనికి గ్రూపు-2 లో మంచి ర్యాంక్ రావడం పట్ల గ్రామ ప్రజలు, బంధువులు అభినందనలు తెలిపారు.