మానుకోట గాయం ఇంకా మానలేదు కౌశిక్ రెడ్డి...!

అగ్రకుల అహంకారంతో బీసీలపై విషం చిమ్ముతున్న అధికార పార్టీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తక్షణమే బీసీలకు క్షమాపణ చెప్పాలని బీసీ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు బొల్క వెంకట్ యాదవ్ డిమాండ్ చేశారు.ఆదివారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మానుకోటకు తీసుకొచ్చి మా బీసీ,ఎస్సీ,ఎస్టీ బిడ్డలపై రాళ్లతో,తుపాకీతో మారణాయుధాలతో బెదిరించిన ఉద్యమ ద్రోహి అని మండిపడ్డారు.

 Kaushik Reddy's Wrist Injury Is Still Not Healed...!-TeluguStop.com

ఆనాటి ఘటనలను ఇంకా మరవలేదని,నీలాంటి వాడికి ఎమ్మెల్సీ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి,నీకు తగిన బుద్ది చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు.
నీ అధికార బలంతో అహంకారపు మాటలతో ముదిరాజ్ బిడ్డను కించపరిచే విధంగా మాట్లాడి,దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి( MLC Kaushik Reddy )ని ఎమ్మెల్సీ పదవి,ప్రభుత్వ విప్ నుండి వెంటనే తొలగించాలని, అలాగే ఆ వ్యాఖ్యలను సుమోటగా తీసుకొని పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సోషల్ మీడియాకు సంబంధించిన రిపోర్టర్ ను బంధించి చిత్రహింసలు పెట్టి ముదిరాజ్ కులం పేరుతో ఆసభ్య పదాలతో తిడుతూ మళ్లీ ఎవరితో చెప్పొదంటూ బూతులు తిట్టడాన్ని సీరియస్ గా పరిగణించాలని కోరారు.

బాధ్యత గల హోదాలో ఉన్న కౌశిక్ రెడ్డి ముదిరాజ్ కులం( Mudiraj )పై కక్ష కట్టడం శోచనీయమన్నారు.మా బీసీ బిడ్డల పట్ల అవమానకరంగా మాట్లాడిన కౌశిక్ రెడ్డికి బుద్ధి చెప్పాలని బీసీ,ఎస్టీ, ఎస్సీ కుల సంఘాలు ఈ ఘటనను ఖండించాలని,అన్ని జిల్లా కేంద్రాల్లో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు.

కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే నీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సమితి జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube