ఉబ్బసము (Asthma) ఒక తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి.ఇది దీర్ఘకాలంగా మనిషికి ఊపిరి అందకుండా చేస్తుంది.
ఇది పిల్లలలోను పెద్దవారిలోను కూడా కనిపిస్తుంది.అయితే ఇద్దరిలోనూ కారణాలు వేరువేరుగా ఉంటాయి.
ఈ వ్యాధి ప్రధాన లక్షణం ఆయాసం.
ఈ వ్యాధి మూలంగా శ్వాస నాళాలు సంకోచించి వాపు మూలంగా శ్లేష్మం ఎక్కువగా తయారై ఊపిరికి అడ్డుకుంటాయి.
అయితే ఇలా జరగడానికి సాధారణంగా వాతావరణంలోని ఎలర్జీ కలిగించే పదార్ధాలు కారణంగా చెప్పవచ్చును.పొగాకు, చల్లని గాలి, సుగంధాలు, పెంపుడు జంతువుల ధూళి, వ్యాయామం, మానసిక ఆందోళన మొదలైనవి ఇందుకు ప్రధాన కారణాలు.
పిల్లలలో జలుబు వంటి వైరస్ వ్యాధులు ప్రధాన కారణము.

ఈ విధమైన శ్వాస నాళాల సంకోచం వలన పిల్లి కూతలు, ఆయాసం, ఛాతీ పట్టినట్లుగా ఉండడం మరియు దగ్గు వస్తాయి.శ్వాస నాళాల వ్యాకోచాన్ని కలిగించే మందులు (Bronchodilators) సాధారణంగా మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.అయితే తగ్గినట్లుగానే తగ్గి మళ్ళీ తిరిగి వచ్చేయడం ఉబ్బసం యొక్క ప్రధానమైన లక్షణం.
ఇందుమూలంగా వీరు మందులకు అలవాటు పడిపోయే ప్రమాదం ఉంది.కొంతమందిలో ఈ వ్యాధి ప్రాణాంతకం కూడా కావచ్చును.

బ్రాంకోడైలేటార్స్, కార్డికోస్టిరాయిడ్స్, ఆంటిబయోటిక్స్, స్ర్పే, మందులు వీటి వలన వెంటనే ఉపశమనం కలుగుంది.కానీ వ్యాధి మళ్లీ తిరగబడతుంది.దీర్ఘకాలికంగా వాడుట వలన మందుల సైడ్ ఎఫెక్ట్స్, పిల్లల పెరుగుదల లోపాలు, మానసిక ఆందోళన, జ్ఞాపకశక్తి తరుగుదల, బరువు పెరుగుట కలుగవచ్చును.అస్తమాను మెడిటేషన్, యోగా వలన చాలా వరకు నివారించవచ్చు.
టొబాకో, పొగత్రాగడం, కాలుష్య పదార్థాలకు దూరంగా ఉండటం.స్వచ్ఛమైన గాలి, నీరు ఉన్న ప్రదేశాలలో నివసించుట.
తీవ్రమైన కేసులలో వారికి ఆ ప్రదేశం వలన వస్తుంది.అంటే అక్కడి నుండి వేరే ప్రదేశానికి మారడం అవసరమవుతుంది.

చలికాలం వచ్చిందంటే చాలు ఆస్తమా విజృంభిస్తుంది.రీసెంట్ గా పిల్లల్లో వచ్చే ఆస్తమాపై శాస్త్ర్రవెత్తలు రిసెర్చ్ చేశారు.చాపలు తినడం వలన ఆస్తమాను నివారించవచ్చని కనుక్కున్నారు.ఈ మేరకు హ్యూమన్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ అనే జర్నల్లో ఓ అధ్యయనాన్ని సైంటిస్టులు ప్రచురించారు.ఆస్తమాతో బాదపడుతున్న పిల్లలకు ఆరు నెలల పాటు వరుసగా చేపల ఆహరం ఇచ్చారు.దీంతో పిల్లల్లో ఆస్తమా తగ్గిందని సైంటిస్టులు చెప్పారు.
చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి.అలాగే యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి కనుక ఊపిరితిత్తుల్లో వచ్చే వాపు తగ్గుతుందని సైంటిస్టులు తెలిపారు.
కనీసం వారంలో రెండుసార్లు చేపలను తినాలని సూచించారు.ఇవి తినడం వల్ల ఇతర శ్వాసకోస వ్యాధులకు కూడా దూరంగా ఉండవచ్చని చెప్పారు.