ఉదయం నిద్రలేవగానే మబ్బుగా, మత్తుగా ఉంటోందా ? ఏ పనీ చేయబుద్ది కావడం లేదా ? బద్దకంగా ఉందా ? మూడీగా, డిప్రెషన్‌లో ఉంటున్నారా ? అయితే అది మీ తప్పు కాదు.ఎందుకంటే.
అది చలికాలం వల్ల.అవును, మీరు విన్నది నిజమే.
సాధారణంగా ఇలాంటి స్థితి చాలా మందికి చలికాలంలోనే వస్తుంది.దీన్నే Seasonal Affective Disorder (S.A.D.) అని అంటారు.దీని వల్ల ముందే చెప్పాం కదా, ఏ పనీ చేయబుద్దికాక చాలా బద్దకంగా ఉంటుంది.
దీనికి తోడు మూడీగా ఉంటారు, డిప్రెషన్‌కు లోనవుతారు.అయితే ఈ సీజన్‌లో వచ్చే S.A.D.నుంచి బయట పడాలంటే అందుకు కింద చెప్పిన పలు టిప్స్ పాటించాలి.అవేమిటంటే…

1.చలి కాలంలో S.A.D.రావడానికి గల ముఖ్య కారణాల్లో సూర్య కాంతి కూడా ఒకటి.ఈ కాలంలో మనం సూర్య కాంతిలో ఎక్కువగా గడపం.అందువల్ల మన శరీరం సూర్యకాంతి వల్ల డి విటమిన్‌ను గ్రహించలేదు.దీంతో శరరీంలో సెరటోనిన్ లెవల్స్ తగ్గుతాయి.ఫలితంగా డిప్రెషన్ వస్తుంది.
అయితే ఇలా కాకుండా ఉండాలంటే నిత్యం 30 నిమిషాల పాటు అయినా సూర్యకాంతిలో ఉండాలి.దీంతో విటమిన్ డి పెరిగి సెరటోనిన్ లెవల్స్ పెరుగుతాయి.
డిప్రెషన్ బారిన పడకుండా ఉంటారు.

2.గ్రీన్ టీ, ఆరెంజ్ జ్యూస్, సలాడ్స్, తేనె, అల్లం, నిమ్మరసంతో తయారు చేసిన టీ వంటి ఆహారాలను తీసుకుంటే శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు బాగా అందుతాయి.ఫలితంగా చురుకుదనం పెరుగుతుంది.
యాక్టివ్‌గా ఉంటారు.S.A.D.నుంచి బయట పడవచ్చు.
3.యోగా, మెడిటేషన్, రన్నింగ్, డ్యాన్స్ చేయడం వంటి వ్యాయామాలు చేస్తే శారీరక దృఢత్వమే కాదు, మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది.దీంతో డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు.

4.ఇష్టమైన సంగీతం వినండి.దీంతో మూడ్ మారుతుంది.యాక్టివ్‌గా మారుతారు.
5.ఇంట్లో రూంలను, ఆఫీసులో గదులను నీట్‌గా ఉంచుకోండి.ఆయా ప్రదేశాల్లో సూర్యకాంతి ఎక్కువగా పడేలా చూడండి.ఆహ్లాదాన్ని ఇచ్చే పచ్చని మొక్కలను పూల కుండీల్లో పెట్టుకోండి.దీంతో మనస్సు ప్రశాంతంగా మారుతుంది.

6.మీకు నచ్చిన దుస్తులు వేసుకోండి.విహార యాత్రలకు వెళ్లండి.
లేదంటే సరదాగా ఒక రోజు పిక్‌నిక్‌కు వెళ్లండి.ఇలా చేస్తే మూడ్ మారుతుంది.
7.రోజూ నిద్ర లేచే, నిద్ర పోయే సమయం ఒకేలా ఉండేలా చూసుకోండి.
వారంలో ఒకటి లేదా రెండు రోజులు సెలవు తీసుకున్నా సెలవు ఉందని లేట్ గా నిద్ర లేవకండి.రోజూ లేచే సమయానికే నిద్ర లేవండి.

8.మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో నిత్యం టచ్‌లో ఉండండి.ఇలా చేస్తే మీ మూడ్ మారి హ్యాపీగా ఉంటారు.డిప్రెషన్ పోతుంది.యాక్టివ్‌గా కూడా ఉండవచ్చు.
