మట్టపల్లి బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సూర్యాపేట జిల్లా: మఠంపల్లి మండల పరిధిలోని మట్టపల్లి బ్రిడ్జి సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని క్షతగాత్రులనుమెరుగైన వైద్యం కోసం హాస్పటల్ కు తరలించారు.
స్థానికుల కథనం ప్రకారం.ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఆగి ఉన్న లారీని కారు ఢీ వేగంగా కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కంచిచర్ల మండలానికి చెందిన గొర్రెపాటి శ్రీనివాసరావు (50)మృతి చెందగా, నందిగామకు చెందిన మర్రిపూడి ప్రసాద్,ఖమ్మం జిల్లాకు చెందిన బెట్టే నాగేశ్వరరావుకు గాయాలయ్యాయి.