రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు వలన ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఆఫీస్ రాజీవ్ భవన్ నుండి మిర్యాలగూడ బస్టాండ్ దగ్గరలోని విద్యుత్ డీఈ ఆఫిస్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి,రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన అనంతరం డీఈ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించి,డీఈకి వినతిపత్రం అందజేశారు.

 Mahadharna Under The Auspices Of The Congress Party On Farmers Issues , Congress-TeluguStop.com

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బిఎల్ఆర్ మాట్లడుతూ తెలంగాణ రైతాంగానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్తు అందజేయాలని, రాత్రిపూట కాకుండా ఉదయం నిరంతరాయంగా కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం పొలాలు పొట్ట దశకు వచ్చిన సమయంలో కరెంట్ కోతలు విధస్తున్నారని,కరెంటు కోతలతో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.ఆయా ఏరియాలలో ఉన్న సబ్ స్టేషన్ లో పై అధికారులు ఎప్పుడు మెసేజ్ పెడితే అప్పుడు త్రీఫేస్ కరెంటు బందు చేస్తున్నామని,మా పొరపాటు ఏమీ లేదని ఆపరేటర్లు సమాధానం చెబుతున్నారని అన్నారు.

ఈ మధ్యకాలంలో కొంతమంది రైతులు ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియక రాత్రిపూట చలికి పొలాల వద్దనే పడుకొని కరెంటు వచ్చిన తర్వాత పొలాలకు నీరు పెట్టుకుంటున్నారని తెలిపారు.24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే రోజుకు 8 నుండి 12 గంటలే కరెంటు వస్తుందని, అది కూడా రాత్రి 11 గంటల తర్వాత కొన్ని గంటలు వచ్చి మళ్లీ కరెంటు పోవడం వలన సరిగా పొలాలు పారక పంటలు ఎండిపోతున్నాయని అన్నారు.ఇప్పటికైనా ఉన్నతాధకారులతో మరియు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి అన్నదాతలను ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, బీఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube