జర్నలిస్టులపై సబ్ రిజిస్టార్

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రకటనల సేకరణ నిమిత్తం కార్యాలయానికి వెళ్లిన వార్త జర్నలిస్టులు అల్దాస్ శ్యాం,చంచల లక్ష్మణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దాడి చేసిన సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ పై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని జర్నలిస్టుల డిమాండ్ చేశారు.సోమవారం పలువురు జర్నలిస్టుల మాట్లాడుతూ జర్నలిస్టులపై రోజురోజుకు బెదిరింపులు,దాడులు,దౌర్జన్యాలు అక్రమ కేసులు పెరిగిపోతున్నాయని,ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది గొడ్డలిపెట్టని తీవ్రంగా ఖండించారు.

 Sub-registrar On Journalists-TeluguStop.com

దాడికి పాల్పడిన సబ్ రిజిస్టార్ తిరిగి విలేకర్లపై బ్లాక్ మెయిల్ చేశారంటూ అక్రమ కేసు బనాయించడం దారుణమన్నారు.పత్రికా విలేకర్లు ప్రకటనలు సేకకరించడం సర్వ సాధారణమని,ప్రకటనల కోసం వెళితే దురుసుగా మాట్లాడడమే కాకుండా భౌతిక దాడులకు పాల్పడడం ఏమిటని ప్రశ్నించారు.

సబ్ రిజిస్టార్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, విలేకర్లు ఇచ్చే ఫిర్యాదును కూడా తీసుకొని సబ్ రిజిస్టార్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.పత్రికా స్వేచ్ఛపై,విలేకరులపై ఇదే విధంగా దాడులు,దౌర్జన్యాలు కొనసాగితే జర్నలిస్టు సంఘాలకు అతీతంగా ఐక్య కార్యాచరణ ప్రకటించి రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube