మణిపూర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి:సిపిఐ మహిళా ప్రెసిడెంట్ లక్ష్మి

మణిపూర్( Manipur ) లో గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన దుండగులను కఠినంగా శిక్షించాలని సిపిఐ మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీ అన్నారు.బుధవారం నేరేడుచర్ల మండలం కేంద్రంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ మణిపూర్ లో ప్రభుత్వాన్ని వెంటనే బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు,దేశంలో శాంతి,సుస్థిరత ఏర్పడాలంటే కేంద్రంలో మణిపూర్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపిని గద్దె దించాలన్నారు.

 Manipur Government Should Be Sacked,manipur Government,kuki Women,manipur Govern-TeluguStop.com

బిజెపి మరియు ఆర్ఎస్ఎస్ గూండాలు మతోన్మాద సిద్ధాంతాలను అనుసరిస్తూ కులాలతో మతాలతో రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు.మత వైషమ్యాలు రెచ్చగొట్టి జాతుల మధ్య తెగల మధ్య విద్వేషాలు రగిల్చి రాజకీయంగా పబ్బాలు గడుపుకోవాలని చూస్తున్నారన్నారు.

అనేక నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో కుకీ( Kuki ),నాగ జాతులను అణగదొక్కేందుకు జరుగుతున్న హత్యాకాండ అత్యంత అమానుషమని అన్నారు.ఇంత జరుగుతున్న ప్రధానమంత్రి,కేంద్ర హోం శాఖ మంత్రి నోరు మెదపకపోవడం దేశద్రోహంతో సమానమని వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో ఉల్లెందుల అరుణ,అయిల భాయమ్మ,ఉద్దోజు పద్మ, మంగ,చెరుకుపల్లి లక్ష్మమ్మ,తిరుపతమ్మ, సత్యవతి,నాగమణి, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube