సంతోష్ బాబు త్యాగం చిరస్మరణీయం

సూర్యాపేట జిల్లా:దేశ కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబు చరిత్రలోనే చిరస్మరణీయుడిగా నిలిచిపోతారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో అసువులుబాసిన మహావీరచక్ర దివంగత కల్నల్ సంతోష్ బాబు రెండవ వర్ధంతి సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని కాసరబాద్ రోడ్ స్మృతి వనంలో సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని ఆయన కుటుంబ సభ్యులతో కలసి ఆవిష్కరించి,ఘనంగా నివాలులర్పించారు.

 The Sacrifice Of Santosh Babu Is Memorable-TeluguStop.com

అనంతరం మంత్రి మాట్లాడుతూ కల్నల్ సంతోష్ బాబు మరణానంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సహాయ సందేశం ఇతర రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశానికి స్ఫూర్తివంతమైన సందేశాన్ని చేర వేసినట్లైందన్నారు.ఆర్మీలో పనిచేసే ప్రతి ఒక్కరికి రేపటి రోజున వారి వారి కుటుంబాలకు భారత ప్రజలు అండగా ఉంటారనేది ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సహాయానికి సందేశమని వివరించారు.

భారత్-చైనా సరిహద్దుల్లో కల్నల్ సంతోష్ బాబు చనిపోతే ఆయన భౌతిక ఖాయన్ని తెలంగాణా ప్రభుత్వం హకింపేట వద్ద నుండి సూర్యాపేట వరకు తీసుకు వస్తున్నప్పుడు దారిపోడువునా ప్రజలు నీరాజనం పలికిన తీరు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సందేశానికి అద్దం పడుతుందన్నారు.అటువంటి త్యాగానికి ఏమిచ్చినా సరిపోదని,దేశభద్రత కోసం ప్రాణాలు అర్పించిన వారి వెంట తెలంగాణా ప్రభుత్వం,ప్రజలు ఉంటారని తెలియజెప్పేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పునట్లుగా పుట్టిన వారు మరణించక తప్పదని, జీవించినంత కాలం ఎలా బతికి ఉన్నామన్నది ముఖ్యమని అన్నారు.ఆ కోవలోనే కల్నల్ సంతోష్ బాబు జాతి ఉన్నంత కాలం ప్రజల మనసులో చిరస్మరణీయుడిగా నిలిచి పోతారన్నారు.

అటువంటి మహనీయుడు ప్రాణ త్యాగం చేసింది మొదలు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి ప్రశంసించారు.కార్యక్రమంలో కల్నల్ సంతోష్ కుటుంబ సభ్యులతో పాటు మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల లలితా ఆనంద్,జడ్పీటిసి జీడి భిక్షం,రాష్ట్ర టీఆర్ఎస్ కార్యదర్శి వై.వి,మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ,పట్టణ ప్రమఖులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube