అంతా నా ఇష్టం అంటున్న ఫీల్డ్ అసిస్టెంట్

సూర్యాపేట జిల్లా: జిల్లాలోని చివ్వేంల మండలం బి.చందుపట్ల గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ శుక్రవారం 300 మంది ఉపాధి కూలీలను పనికిరావద్దని వెనక్కి పంపించడంతో ఉపాధి కూలీలు అవాక్కయ్యారు.

 Field Assistant Mis Behavior In Suryapet District, Field Assistant, Suryapet Di-TeluguStop.com

ఇదేంటని గ్రామస్తులు ఫీల్డ్ అసిస్టెంట్ రవి ఇంటికి వెళ్లి ప్రశ్నిస్తే నా ఇష్టం,ఏమైనా చేస్తా,నా ఇష్టం వచ్చినట్టు చేస్తా,ఎవరికీ చెప్పుకుంటారో చెప్పుకోండని దురుసుగా ప్రవర్తించడంతో కూలీలు అతని ఇంటి ముందు బైఠాయించారు.

దీనితో గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొనడంతో గ్రామ కార్యదర్శి జోక్యం చేసుకుని తిరిగి పనులకు పంపించడంతో ఘర్షణ సద్దుమణిగింది.

ఈ సందర్భంగా పలువురు కూలీలు మాట్లాడుతూ ఓకే రోజు 300 మంది కూలీలను పని వద్దని వెనక్కి పంపించాడని ఆవేదన వ్యక్తం చేశారు.పనికిరాకుండా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి మస్టర్ వేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడని ఆరోపించారు.

ఏదైనా అడిగితే సరైన సమాధానం చెప్పకుండా దురుసుగా ప్రవర్తించే సదరు ఫీల్డ్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube