సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల శివారులోని ఎన్టీఆర్ కాలనీ వద్ద మిర్యాలగూడ కోదాడ ప్రధాని రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.నేరేడుచర్ల మండలం రామాపురం గ్రామానికి చెందిన పిల్లలమర్రి సత్యనారాయణ(40)అతని కుమారుడు జశ్వంత్(13) మరియు కూతురు కావేరితో కలిసి మోటార్ సైకిల్ పై నేరేడుచర్ల నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో సత్యనారాయణ అతని కుమారుడు జశ్వంత్ అక్కడికక్కడే మృతిచెందగా, కూతురు కావేరికి సీరియస్ గా ఉండటంతో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.