సూర్యాపేట జిల్లా: నడిగూడెం మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో 10వ,జోనల్ స్పోర్ట్స్ మీట్ క్రీడలను సోమవారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంబించారు.అనంతరం క్రీడాకారులతో కలిసి ఆటలు ఆడుతూ ఉత్సాహపరిచారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.క్రీడల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.
విద్యార్థులు కోలాటం, యోగతో కూడిన నృత్యాలను ప్రదర్శించి అలరించారు.క్రీడల్లో 9 గురుకులాల్లోని 765 మంది క్రీడాకారులు పాల్గొనున్నట్లు ప్రిన్సిపల్ వాణీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో 9 గురుకులాల ప్రిన్సిపాల్స్, పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు,మండల మాజీ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.