సూర్యాపేట జిల్లా: బీఆర్ఎస్ పార్టీ( BRS party ) నుండి బహిష్కరించిన పొంగులేటి,జూపల్లి లను
కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొనిఖమ్మంలో ఒక సభ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఏదో సాధించినట్లు చంకలు కొడుతుందని,
హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి( MLA Saidireddy ) అన్నారు.
గురువారం హుజూర్ నగర్ లో ఉచిత కరెంటుపై రేవంత్ రెడ్డి( Revanth reddy ) చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఏర్పాటు దీక్షలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ పార్టీ కపట విధానాలు బైటపడ్డాయన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వమని,రైతు ప్రభుత్వం అంటేనే కేసీఆర్ ప్రభుత్వమన్నారు.మహారాష్ట్ర రైతులు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ పాలసీనీ అమలవుతున్న తీరుపై ఆశ్చర్యపోతున్నారని, తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో మర్చిపోయారని,ప్రజలు ఆ నాయకుల పట్ల విశ్వాసం కోల్పోయారని ఎద్దేవా చేశారు.
మూడు సంవత్సరాల్లో మూడు వేల ఐదు వదల కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది అన్నారు.