న్యూస్ రౌండప్ టాప్ 20

1.సచివాలయ వ్యవస్థ పై పవన్ కళ్యాణ్ ప్రశ్న

Telugu Aicc, Bjp Congress, Cm Kcr, Jagan, Janasena, Janasenani, Kishan Reddy, Pa

పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు సచివాలయ వ్యవస్థ దేనికి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

2.వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన,బిజెపి పొత్తు

ఏపీలో జరిగే ఎన్నికల్లో బిజెపి ,టిడిపి, జనసేన మధ్య పొత్తు ఉంటుందని బిజెపి నేత మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు.

3.పురందరేశ్వరి విమర్శలు

Telugu Aicc, Bjp Congress, Cm Kcr, Jagan, Janasena, Janasenani, Kishan Reddy, Pa

ఏపీ ప్రభుత్వంపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి విమర్శలు చేశారు.రాష్ట్రంలో రహదారుల దుస్థితి ఏంటో ప్రజలను అడిగితే తెలుస్తుందని అన్నారు.

4.వైసిపి విశాఖ జిల్లా అధ్యక్షుడు రాజీనామా

విశాఖపట్నం వైసిపి జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పదవికి, పార్టీకి రాజీనామా చేశారు.

5.పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు

Telugu Aicc, Bjp Congress, Cm Kcr, Jagan, Janasena, Janasenani, Kishan Reddy, Pa

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కేసు నమోదయింది.వాలంటీ సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడలోని కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు.

6.ఏపీలో త్రిబుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల

ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలోని నాలుగు ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ రోజు విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.

7.సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా , ఖమ్మం , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.

8.కోడి కత్తి కేసులో కుట్రకోణం లేదు

కోడి కత్తి కేసులు ఎటువంటి కుట్ర కోణం లేదని క్షుణ్ణంగా దర్యాప్తు చేసినందున మళ్లీ లోతైన విచారణ అవసరం లేదని ఎన్ఐఏ తరపు న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు.

9.ఏపీ మంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కౌంటర్

Telugu Aicc, Bjp Congress, Cm Kcr, Jagan, Janasena, Janasenani, Kishan Reddy, Pa

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ విద్య వ్యవస్థపై బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

10.జగన్ తో వర్సిటీల వైస్ ఛాన్స్ లర్ల భేటీ

రాష్ట్రంలో ఉన్నత విద్యపై ఏపీ సీఎం జగన్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు.ఈ మేరకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్లతో జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

11.అమెరికాకు కిషన్ రెడ్డి

Telugu Aicc, Bjp Congress, Cm Kcr, Jagan, Janasena, Janasenani, Kishan Reddy, Pa

 తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు అమెరికాకు బయలుదేరి వెళ్లారు.ప్రపంచ పర్యాటక అభివృద్ధి పై ప్రసంగించేందుకు కిషన్ రెడ్డిని ఐక్యరాజ్యసమితి ,ప్రపంచ పర్యాటక సంస్థ ఆహ్వానించింది.దీంతో రేపు న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి హై లెవెల్ పొలిటికల్ ఫోరం వేదికగా కిషన్ రెడ్డి ప్రసంగించనున్నారు.

12.పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై బొత్స ఆగ్రహం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన విమర్శలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.ఆడపిల్లలపై అసభ్యకరంగా మాట్లాడడం కరెక్ట్ అంటూ మండిపడ్డారు.

13.శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

Telugu Aicc, Bjp Congress, Cm Kcr, Jagan, Janasena, Janasenani, Kishan Reddy, Pa

తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి నితిన్ గట్కరి దర్శించుకున్నారు.ఈరోజు ఉదయం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారి తోమాల సేవలో పాల్గొన్నారు.

14.ఫ్రాన్స్ లో ప్రధాని మోదీ పర్యటన

Telugu Aicc, Bjp Congress, Cm Kcr, Jagan, Janasena, Janasenani, Kishan Reddy, Pa

రెండు రోజులపాటు ఫ్రాన్స్ లో ప్రధాన నరేంద్ర మోది పర్యటించనున్నారు.

15.నేడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం

నేడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధ్యక్షతన ఉద్యోగ సంఘాలతో భేటీ నిర్వహించనున్నారు.

16.కేటీఆర్ కు కోమటిరెడ్డి సవాల్

కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేటీఆర్ కు సవాల్ విసిరారు.24 గంటల పాటు నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

17.జనసేన ఆందోళనలు

Telugu Aicc, Bjp Congress, Cm Kcr, Jagan, Janasena, Janasenani, Kishan Reddy, Pa

జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరుతూ విజయవాడలోని చిట్టి నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జనసేన నాయకుడు పొతిన మహేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టి వైసిపి ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

18.పెళ్ళాం పెళ్ళాం అంటుంటే చిరాకేస్తుంది : పవన్ కళ్యాణ్

జగన్ పదే పదే పెళ్ళాం పెళ్ళాం అంటుంటే, ఆ భాష చూస్తుంటే చిరాకు వేస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

19.డబుల్ డెక్కర్ రైల్లో మంటలు

Telugu Aicc, Bjp Congress, Cm Kcr, Jagan, Janasena, Janasenani, Kishan Reddy, Pa

బెంగళూరు నుంచి చెన్నై వెళ్లే డబుల్ డెక్కర్ రైల్లో ప్రమాదం జరిగింది.రైలు గుడియాత్తం స్టేషన్ చేరుకోగానే మంటలు వ్యాపించాయి.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 55,000

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 60,000

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube