మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) మూడు దశాబ్దాల పాటు నంబర్ వన్ హీరోగా ఒక వెలుగు వెలిగారు.ఆ సమయంలో ఎంతోమంది నుంచి పోటీ వచ్చినా చిరంజీవి స్థానం చెక్కు చెదరలేదు.
అయితే చిరంజీవి ఈ స్థాయికి చేరుకున్నాడంటే ఆయనలో ఉన్న కొన్ని లక్షణాలే కారణమని చెప్పవచ్చు.ఎంత ఎదిగినా చిరంజీవి ఒదిగి ఉండటానికి ఇష్టపడతారు.
చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చిరంజీవి ఎంతగానో గౌరవిస్తారు.
ఎలాంటి పాత్ర ఇచ్చినా ఒదిగిపోయే తీరు, ఆ పాత్రకు జీవం పోసేలా చిరంజీవి నటన ఉండటం వల్లే చిరంజీవి కెరీర్ పరంగా భారీ స్థాయిలో సక్సెస్ అయ్యారు.
అదే సమయంలో చిరంజీవి టాలెంట్ ఉన్న ఎంతోమంది నటులను ప్రోత్సహించి వాళ్లు కెరీర్ పరంగా సక్సెస్ సాధించే విషయంలో తన వంతు సహాయసహకారాలను అందించారు.చిరంజీవి వయస్సు ప్రస్తుతం 68 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.

అయితే ఆయన లుక్స్ ను చూసిన అభిమానులు మాత్రం ఆయన వయస్సు 68 అంటే అస్సలు నమ్మలేరు.మరో నెల రోజుల్లో భోళా శంకర్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.భోళా శంకర్ సినిమాకు మెహర్ రమేష్( Meher Ramesh ) డైరెక్టర్ కావడంతో ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఒకింత టెన్షన్ నెలకొంది.భోళా శంకర్ సినిమాకు అనిల్ సుంకర( Anil Sunkara )నిర్మాతగా వ్యవహరిస్తున్నారనే సంగతి తెలిసిందే.

భోళా శంకర్ సినిమాకు ఏ రేంజ్ లో బిజినెస్ జరుగుతుందో చూడాలి.ఈ సినిమా వాల్తేరు వీరయ్య సినిమా( Waltair Veerayya )ను మించి సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.త్వరలో చిరంజీవి కొత్త సినిమాలను ప్రకటించనుండగా ఆ సినిమాలు సైతం చిరంజీవికి భారీ విజయాలను అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.చిరంజీవి కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
భిన్నమైన కథలను ఎంచుకుంటూ చిరంజీవి కెరీర్ ను కొనసాగిస్తున్నారు.







