తెలంగాణ తల్లి చేతిలో బీరు సీసా...!

సూర్యాపేట జిల్లా: నాగారం మండలం పసునూరు గ్రామంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో ఖాళీ బీరు సీసాను పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.గ్రామాల్లో వాడవాడకు నాలుగైదు బెల్ట్ షాపులు ఉండడంతో తప్ప తాగిన ఆకతాయిలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 Beer Bottle In The Hands Of Telangana Thalli Statue Suryapet-TeluguStop.com

ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని,

గ్రామంలో బెల్ట్ షాపులు లేకుండా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.లేకపోతే రానురాను తాగుబోతుల ఆగడాలు శృతిమించే ప్రమాదం ఉందని, ఆడపిల్లలు,మహిళలు బజారుకు వెళ్లాలంటే భయపడుతున్నారని, గుడి,బడి అనే తేడా లేకుండా బెల్టు షాపులు వెలుస్తున్నాయని,వైన్స్ లో దొరకని మందు కూడా బెల్ట్ షాపుల్లో లభ్యమవడంతో తప్పతాగి అర్థరాత్రి వరకు రోడ్లపై తిరుగుతున్నారని అన్నారు.

బెల్ట్ షాపులపై పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube