గత కొద్ది రోజులుగా ఏపీలో రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) వర్సెస్ జనసేన పవన్ కళ్యాణ్, టీడీపీ చంద్రబాబు అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్నాయి.పవన్ చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించడానికి అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆర్జీవి కాచుకు కూర్చున్నాడు.
ఇక అవకాశం వచ్చింది అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉక్కిరిబిక్కి చేస్తున్నారు.ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ, జనసేన పార్టీల పాలిట దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అతిపెద్ద ప్రత్యర్థిగా తయారయ్యారని చెప్పవచ్చు.
కాగా ఇటీవల పవన్‌కు( Pawan Kalyan ) తొమ్మిది ప్రశ్నలు సంధించి ప్రశ్నిస్తానన్న నాయకుడినే గుక్క తిప్పుకోకుండా చేశారు ఆర్జీవి. ఇది ఇలా ఉంటే తాజాగా ట్విటర్ వేదికగా మరోసారి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌కు( Skill Development Scam ) సంబంధించి కీలకమైన ప్రశ్నలను ఆయన సంధించారు.ప్రతి ప్రశ్నతో పాటు ఔనా? అంటూ నిలదీయడం గమనార్హం.తాను వేసిన ప్రశ్నలకు చంద్రబాబుని అభిమానించే వాళ్లెవరైనా సమాధానం చెప్పకపోతే ఔను అని అనుకోవాల్సి ఉంటుంది అంటూ ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌పై చేసుకున్న ఒప్పందం బోగస్ అవునా? అనే మొదటి ప్రశ్నతో మొదలై, ఇళ్ల నిర్మాణం విషయంలో డబ్బు చంద్రబాబు గారి( Chandrababu Naidu ) చేతిలోకి వెళ్లిందనే విషయాన్ని ఐటీ నోటీసుల( IT Notices ) ద్వారా ఎలా వెలుగులోకి వచ్చిందో.అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అనేక షెల్ కంపెనీలు, నిందితులైన యోగేష్ గుప్తా, మనోజ్ వాసుదేవ్ పార్దసాని తదితరుల ద్వారా ఆయన మాజీ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్‌కు, అక్కడ నుంచి ఆయనకు చేరిందని ఈడి చెప్తోంది.
అవునా ? అని చివరి ప్రశ్నను సంధించారు.అలాగే ఒక వేళ కాదంటే పెండ్యాల శ్రీనివాస్( Pendyala Srinivas ) ఎందుకు పారిపోయినట్టు? అని చివరి ప్రశ్నలో నిలదీయడం గమనార్హం.ఆర్జీవీ వేసిన ప్రతి ప్రశ్న కీలకమైందే.అందరూ రోజూ మాట్లాడుకున్నవే అయినప్పటికీ, టీడీపీ, జనసేనలను ఓ రేంజ్లో ఆడుకునే దర్శకుడిగా ఆర్జీవీకి గుర్తింపు ఉంది.దీంతో ఆయన వేసిన ప్రశ్నలకు ప్రాధాన్యం ఏర్పడింది.తన 12 ప్రశ్నలకు స్పందించకపోతే అన్నింటికి ఔననే సమాధానం ఇచ్చినట్టే అని తనకు తానుగా ఆర్జీవీ ప్రకటించడం విశేషం.