మంత్రి చెక్కు ఇచ్చారు అకౌంట్లో డబ్బులు జమ కాలేదు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: మహిళా శక్తి నేటి సమాజానికి చాటాలని నాటి నుండి నేటి వరకు ప్రభుత్వాలు పట్టణ మరియు గ్రామీణ ప్రాంత మహిళలు ఆర్థిక స్వయం సహాయకంగా ఎదగడం కొరకు మహిళా సంఘాల ద్వారా రుణ ప్రోత్సహకలు అందిస్తూ వస్తున్నాయి.ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని 416 మహిళా సంఘాలకు 2018-19 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ.20 లక్షల వడ్డీని తిరిగి ఇచ్చారు.అదే విధంగా 2019-20,2020-21కి గాను 526 మహిళా సంఘాలకు 1 కోటి 33 లక్షల 89 వేల రూపాయల చెక్కును 2023 జూన్ 15 న ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత,పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా మహిళా సంఘాలకు అందజేశారు.

 The Minister Gave The Check But The Money Was Not Deposited In The Account , Mon-TeluguStop.com

కానీ,నేటి వరకు ఒక్క సంఘంలో కూడా డబ్బులు జమ కాక పోవడంతో మహిళా సంఘాల సభ్యులు అవేదన వ్యక్తం చేశారు.ఇదే విషయమై ఏపీఎం అంజయ్యను వివరణ కోరగా చెక్కు ఇచ్చిన మాట నిజమేనని,అతి త్వరలో మహిళా సంఘాలకు డబ్బులు అకౌంట్లో జమ అవుతాయని,2021 నుండి 2023 వరకు మహిళా సంఘాల వడ్డీలు రావాల్సి ఉందని చెప్పడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube