అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి:సీపీఐ

సూర్యాపేట జిల్లా:జిల్లాలో గత రెండు రోజులుగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా పడుతున్న అకాల వర్షాలకు అన్నదాతలు ఆగమయ్యారని,నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్( Ganna Chandrasekhar ) ప్రభుత్వాన్ని కోరారు.జిల్లా కేంద్రంలో సిపిఐ జిల్లా ఆఫీస్ కామ్రేడ్ ధర్మబిక్షం భవనంలో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్కెట్ కల్లాలలో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసి పోయిందని,మామిడి, సపోటా,బొప్పాయి తదితర పండ్లతోటలు ఈదురు గాలులకు నేలమట్టమై తీవ్ర నష్టం వాటిలిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 Farmers Affected By Untimely Rains Should Be Supported: Cpi-TeluguStop.com

రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల సానుకూలంగా స్పందిస్తున్నందున ప్రభుత్వ అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి అంచనాలను ప్రభుత్వానికి అందించాలని అధికారులను కోరారు.తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసి రైతులను కాపాడాలన్నారు.సన్నరకం,దొడ్డురకం అని తేడా లేకుండా క్వింటాకు రూ.500 బోనసును వెంటనే అందజేయాలన్నారు.ఈ సమావేశంలో సీపీఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు( Bejawada Venkateswarlu ),రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అనంతల మల్లేశ్వరి,గీత పనివారాల జిల్లా అధ్యక్షుడు కొండ కోటయ్య,మాజీ సర్పంచ్ నంద్యాల రాంరెడ్డి,సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు,ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపగాని రవి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube