బీఎస్పీ తెలంగాణ భరోసా సభను విజయంతం చేయండి: పిలుట్ల శ్రీనివాస్

ఈ నెల 7న హైదరాబాద్ లో జరిగే బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ భరోసా సభ( Telangana Barosa Sabha )కు వేలాదిగా తరలివచ్చి విజయంతం చేయాలని బీఎస్పీ కోదాడ నియోజకవర్గ ఇంచార్జి పిలుట్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.సోమవారం కోదాడ మండల కేంద్రంలో తెలంగాణ భరోసా సభ గొడ పత్రికలను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) పాలన పూర్తిగా విఫలమైందన్నారు.

 Bahujana Samaj Party Telangana Barosa Sabha In Suryapet,suryapet,bahujana Samaj-TeluguStop.com

గడిచిన 9 ఎండ్లలో అన్ని వర్గాల ప్రజలను కేవలం గొర్రెలు,బర్రెలకే పరిమితం చేస్తూ బహుజనలను మోసం చేస్తూ,నాణ్యమైన విద్య,వైద్యానికి మనల్ని దూరం చేస్తున్నారని ఆరోపించారు.తెలంగాణ భరోసా సభకు బహుజన సమాజ్ పార్టీ( bahujana Samaj Party ) జాతీయ అధ్యక్షురాలు బెహంజీ కుమారి మాయావతి రానున్నారని,కేసీఆర్ పాలనలో మోసపోయిన తెలంగాణ ప్రజలకు భరోసా కల్పించేందుకు ఈ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ మండల అధ్యక్షులు నేలమర్రి శ్యామ్, ఉపాధ్యక్షురాలు మంజుల, నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు శ్రావణ్,సురేష్, గోపాలకృష్ణ,తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube