సూర్యాపేట జిల్లా: వ్యవసాయ గణన క్షేత్రస్థాయిలో పకడ్బందీగా చేపట్టి వాస్తవ వివరాలు సేకరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు.బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాల సమావేశ మందిరంలో జాతీయ స్థాయిలో 11వ వ్యవసాయ గణన నిర్వహించడం కోసం గాను జిల్లా స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు,ప్లానింగ్ అధికారులకు రాష్ట్ర అర్థ గణాంక శాఖ ఆధ్వర్యంలో 11వ వ్యవసాయ గణనపై జరిగే శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
డిప్యూటీ డైరెక్టర్ శివకుమార్, సిపిఓ వెంకటేశ్వర్లు, వ్యవసాయ అధికారి రామారావు నాయక్ తో కలిసి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ గణన వాస్తవ వివరాలను సేకరించడం వలన వ్యవసాయ స్థితిగతులు విధివిధానాలు రూపకల్పనకు ఎంతో తోడ్పడతాయన్నారు.ప్రభుత్వం వ్యవసాయ గణన ఐదేళ్ల ఒకసారి నిర్వహిస్తుందన్నారు.
వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాలలో చిన్న సన్నకారు రైతులు, పెద్ద రైతుల వివరాలు వారి యొక్క సాగు విస్తీర్ణం పంటల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను సేకరించాలని సూచించారు.వ్యవసాయ అధికారులు భూములు వివరాలు నమోదు చేసినప్పుడు పట్టణాలకు సమీపంలో ఉన్న మండలాలలో అక్కడ వ్యవసాయేతర భూములను పరిశీలించి వ్యవసాయ భూములను మాత్రమే గణనలలో నమోదు చేయాలన్నారు.
రైతులకు డిమాండ్ ఉన్న లాభదాయక పంటలను సాగు చేసుకునే విధంగా వ్యవసాయ అధికారులు రైతులకు చైతన్య పరచాలన్నారు వ్యవసాయ గణన వివరాలన్నిటిని వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక యాప్ లో నమోదు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.వ్యవసాయ గణనకు కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని,జిల్లా కలెక్టర్ చైర్మన్గా,సిపిఓ కన్వీనర్ గా,మెంబర్లుగా వ్యవసాయ అధికారి, హార్టికల్చర్ అధికారి, ఎల్డీఎం వ్యవహరిస్తారని తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో క్రాఫ్ బుకింగ్ చాలా విజయవంతంగా జరపడం జరిగిందని, అలాగే వ్యవసాయ గణన కూడా విజయవంతంగా జరపాలని తెలిపారు.
మొదటి దశలో కమతముల వర్గీకరణ, రెండవ దశలో పంటల వివరములు, నీటిపారుగా పారుదల వివరములు సేకరించడం జరుగుతుందన్నారు.
మూడవ దశలో ఎరువులు క్రిమిసంహారక మందుల వాడకం వ్యవసాయ పరికరాలకు సంబంధించిన సమాచారం సేకరించ బడుతుందన్నారు.ముందుగా ఏవోలకు, ఏడీఏలకు, ఏఈఓ లకు ఎంపీఎస్వోలకు,డిప్యూటీ ఎస్ఒలకు అధికారులకు శివకుమార్ డిప్యూటీ డైరెక్టర్ ఆప్ ఎకనామిక్స్ అండ్ స్టయిల్స్ కార్యాలయం హైదరాబాద్, దీప్తి డిప్యూటీఎస్ఓ,భరణి ఏఎస్ఓ వివిధ అంశాలపై అనగా డేటా సేకరణ యొక్క భావనలు నిర్వచనాలు విధివిధానాలను సులభంగా అర్థమయ్యేలా శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎల్డీఎం సిహెచ్ బాపూజీ,జిల్లా పశుసంవర్ధక అధికారి జి.శ్రీనివాస్,ఆర్టికల్చర్ అధికారి శ్రీధర్,సీనియర్ అసిస్టెంట్ డి.శ్యామ్, శ్రీనివాస్,అధికారులు, సిబ్బంది అధికారుల పాల్గొన్నారు.