జంప్ జిలానీలు అంటే వీరే

సూర్యాపేట జిల్లా:భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ వలస పక్షులకు కొదవలేదు.పార్టీలో పదవి రాకపోయినా,వచ్చిన పదవి నచ్చకపోయినా,పార్టీ అధినాయకత్వం తీరు బాగోలేకపోయినా,పార్టీలో అంతర్గత వర్గపోరు తారాస్థాయికి చేరినా,మెజారిటీ సమస్య ఉత్పన్నమైనా వేసుకున్న చొక్కా మార్చినంత సులువుగా పార్టీ కండువాలు మార్చుకోవడం ఆనవాయితీగా మారింది.

 These Are The Jump Jilani-TeluguStop.com

ఇలాంటి జంపింగ్ జపాంగ్ సంఘటన రెండు రోజుల క్రితం హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే చింతలపాలెం మండలంలోని కిష్టాపురం ఎంపీటీసీ షేక్ షాహేదా బేగం భర్త జానీ పాషా మమా బాజీ శనివారం చింతలపాలెం మండల కేంద్రంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఉత్తంకుమార్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు.24 గంటలు కూడా గడవకముందే మళ్ళీ తిరిగి ఆదివారం ఉదయం మండల జడ్పిటిసి సమక్షంలో గులాబీ కండువా కప్పుకుని అందర్నీ ఆశ్చర్యచకితులను చేశారు.ఈ విపరీత రాజకీయ ధోరణులను చూసి హుజూర్ నగర్ ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.

ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు తమ ఇష్టారాజ్యంగా పూటకో కండువా మార్చడం మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube