పేలు.( Lice ) వీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.తలలో పెరుగుతూ మన రక్తాన్ని పీల్చే చిన్న పరాన్నజీవులివి.వయసుతో సంబంధం లేకుండా చాలా మంది పేలు సమస్యతో బాధపడుతుంటారు.తలలో పేలు ఉంటే దురద విపరీతంగా ఉంటుంది.పైగా పదే పదే తలను గోకడం వల్ల కొందరికి స్కాల్ప్ ఇన్ఫెక్షన్,( Scalp Infection ) హెయిర్ రూట్స్ బలహీనపడటం తదితర సమస్యలు తలెత్తుతాయి.
అందుకే పేలును వదిలించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే కొందరిలో ఎన్ని చేసినా కూడా పేలు ఓ పట్టాన పోవు.
దాంతో ఏం చేయాలో తెలియక తెగ మదన పడుతూ ఉంటారు.కానీ వర్రీ వద్దు ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ హెయిర్ టోనర్ ను కనుక వాడారంటే పేలు ఎంత తీవ్రంగా ఉన్నా కూడా దెబ్బకు పరారవుతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం పేలును తరిమికొట్టే ఆ టోనర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి అందులో రెండు గ్లాసుల వాటర్ పోసుకోండి.
వాటర్ హీట్ అయ్యాక అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం,( Rice ) రెండు టేబుల్ స్పూన్లు మెంతులు,( Fenugreek Seeds ) వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు,( Flax Seeds ) రెండు రెబ్బలు వేపాకు, రెండు రెబ్బలు తులసి ఆకులు, వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి 15 నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తే మన హెయిర్ టోనర్ సిద్ధమవుతుంది.

ఈ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ న్యాచురల్ టోనర్ ను( Natural Toner ) కనుక వాడారంటే తలలో పేలన్ని దెబ్బకు పరారవుతాయి.
పేలును వదిలించుకోవడానికి ఈ టోనర్ చాలా బాగా సహాయపడుతుంది.

అలాగే ఈ టోనర్ ను వాడటం వల్ల చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు.హెయిర్ ఫాల్ సమస్యను నివారించుకోవచ్చు.ఈ టోనర్ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది.
జుట్టుకు చక్కని పోషణ అందించి ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.మరియు ఈ టోనర్ కురులను ఆరోగ్యంగా షైనీ గా సైతం మెరిపిస్తుంది.







