సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాను మరో హీకు చేసి హిట్టు కొట్టడం జరుగుతుంది.అయితే కేవలం హీరో ల విషయంలోనే కాదు హీరోయిన్ల విషయంలో కూడా ఇదే జరుగుతుంది.
ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న రాశికన్నా గురించి ఒక వార్త వైరల్ గా మాడిపోయింది.ఇప్పటివరకు తన కెరియర్ లో రాసి కన్నా ఎన్నో సినిమాలను వదులుకున్న సినిమాలను చూసి అందరూ షాక్ అవుతున్నారు.ఒక్కసారి ఆ లిస్ట్ చూస్తే.
ఎఫ్ 2
: అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఎఫ్2.ఈ సినిమాలో మెహరిన్ పాత్ర కోసం రాశిఖన్నా ను సంప్రదించగా ఈ అమ్మడి నో చెప్పిందట.
మజిలి
: నాగచైతన్య సమంత జంటగా నటించిన మజిలీ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం రాశిని అడిగారట.కానీ రాసికన్నా నో చెప్పడంతో చివరికి ఆ ఆఫర్ దివ్యంక కౌశిక్ కు వెలువరించింది.
రాక్షసుడు
: చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రాక్షసుడు రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో అనుపమ హీరోయిన్.అయితే ముందుగా రాశిఖన్నాను సంప్రదిస్తే ఈ అమ్మడు నో చెప్పిందట.
సర్కారు వారి పాట : మహేష్ హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా కోసం ముందు రాశి కన్నాను సంప్రదించారట దర్శక నిర్మాతలు.ఆమె నో చెప్పడంతో చివరికి కీర్తి సురేష్ ను తీసుకున్నారు.
మహానుభావుడు
: శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన సూపర్హిట్ అయిన మహానుభావుడు సినిమాలో మెహరిన్ కు బదులుగా రాశి ఖన్నాను తీసుకోవాలని అనుకున్నారు.కానీ ఎందుకో ఈ అమ్మడు నో చెప్పిందట.
టక్ జగదీష్
: శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో రితూ వర్మ కు ముందు రాశిఖన్నాను అనుకున్నారట.కానీ చివరికి రీతూ వర్మను ఫిక్స్ చేసారు.
గీతా గోవిందం
: గీత గోవిందం రష్మిక మందన ను కాకుండా రాశి కన్నాను అనుకున్నారట.కానీ ఈ అమ్మడు అప్పుడు బిజీగా ఉండటంతో ఆఫర్ తిరస్కరించిందట.దీంతో రష్మీకకు గీత గోవిందం సినిమా ఒక వరంలా మారి పోయింది.
ఇవే కాకుండా మానాడు, భూమి లాంటి సినిమాలను కూడా ఈ హీరోయిన్ వదులుకుందట.ఇప్పుడు పక్కా కమర్శియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనే విషయం తెలిసిందే.