సూర్యాపేట జిల్లా:తమ నేతను అధికారిక కార్యక్రమానికి ఆహ్వానించలేదంటూ ఒక వర్గం మరో వర్గంపై దాడికి యత్నించడంతో కోదాడ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.దీనితో ఇద్దరు యూత్ లీడర్ల అనుచరులు బాహాబాహి తపడ్డారు.
ఇద్దరు యువ నేతలు పరస్పర దూషణలతో కొద్దిసేపు రచ్చరచ్చ చేస్తూ వీధుల్లో హాల్చర్ చేశారు.కోదాడ రూరల్ మండలం కొమరబండ గ్రామంలో గొర్రెల పంపిణీ కార్యక్రమం రెండు వర్గాల మధ్య ఘర్షణకు వేదికైంది.
జోక్యం చేసుకున్న కొందరు సీనియర్ నేతలు గొడవను సద్దుమణిగించారు.అనంతరం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గొర్రెల పంపిణీ చేసి వెళ్లిన తర్వాత మళ్ళీ వివాదం మొదటికి రావడంతో గులాబీ లీడర్ల లొల్లి చూసి ముక్కున వేలేసుకున్నారు స్థానికులు.