సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణంలో 4 ఏళ్ల బాలుడిని స్థానికులు చూస్తుండగానే 12 మంది సూపారి గాంగ్ కుటుంబ సభ్యులను కొట్టి కిడ్నాప్ చేసుకుని వెళ్ళిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.అప్రమత్తమైన కోదాడ పోలీసుల బాలుడి ఆచూకీని కొర్లపహడ్ టోల్ గేట్ వద్ద గుర్తించి,
మొత్తం గ్యాంగ్ లోని 5 గురు సభ్యులను అదుపులోకి తీసుకొని,2 వాహనాలను స్వాధీనం చేసుకుని కోదాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
కానీ,అసలు బాలుడి ఆచూకీ ఇంత వరకు లభ్యం కాలేదు.బాలుడిని సినీ పక్కీలో మరో వాహనంలోకి మార్చి తరలించినట్లుగా తెలుస్తోంది.