నల్లగొండ జిల్లా:విద్యా శాఖలో ఆనాటి నుంచి ఈనాటి వరకూ కూడా ప్రభుత్వాలు,ప్రభుత్వ అధికారులు మారుతున్నా కానీ,సమగ్ర శిక్షలో పని చేస్తున్న మా బతుకులు మాత్రం మారడం మారడం లేదని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.తమ డిమాండ్ల సాధన కోసం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు చేపట్టిన నిరసన కార్యక్రమం గురువారం మూడో రోజుకు చేరింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరంలో పనిచేసే ఉద్యోగులందరిని కూడా విద్యాశాఖలో విలీనం చేయాలని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రెగ్యులర్ చేయాలని కోరారు.డిమాండ్లను పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు.
విద్యాశాఖలోని సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులుగా రాష్ట్రవ్యాప్తంగా 19300 మంది నల్గొండ జిల్లాలో దాదాపుగా 1100 మంది వివిధ విభాగాలుగా పనిచేస్తున్నామని,గత 20 సంవత్సరాలుగా విద్యాశాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని,సరైన వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నామని వాపోయారు.గత సంవత్సరం అంతా 13/09/2023 న హన్మకొండలో గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు విద్యా శాఖ లోని సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల అందరిని రెగ్యులర్ చెయ్యాలని,ఆ లోపు తక్షణమే పే స్కెల్ అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు.20 ఏళ్లుగా అతి తక్కువ వేతనాలతో శ్రమ దోపిడీకి గురి అవుతున్నామని, మా విలువైన జీవిత కాలం మొత్తం ప్రభుత్వాలు దోచుకున్నాయని,పెరిగిన నిత్యావసర ధరల వలన బ్రతకలేక చస్తున్నామని, భారత దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి-సమాన వేతనం వెంటనే అమలు చెయ్యాలని వేడుకున్నారు.సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, అప్పటివరకు పే స్కేల్ అమలు చేయాలని,ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 10 లక్షలు,ఆరోగ్య బీమా 10 లక్షల సౌకర్యం కల్పించాలని,సమగ్ర శిక్ష ఉద్యోగులలో 61 ఏళ్లు నిండి పదవి విరమణ చేసిన వారికి బెనిఫిట్స్ కింద 25 లక్షలు ఇవ్వాలని,ప్రభుత్వ మరియు విద్యాశాఖ నియామకాలలో వెయిటేజ్ కల్పించాలని,సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ రి ఎంగేజ్ విధానాన్ని ఎత్తివేయాలని, 1100 ఉద్యోగులలో దాదాపుగా 800 మంది ఉద్యోగులు ఈ కార్యక్రమానికి ప్రతిరోజు హాజరవుతున్నారని తెలిపారు.
ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు మా నిరవధిక దీక్షను ఇలాగే కొనసాగిస్తామని సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొలుగూరి కృష్ణ,బొమ్మగాని రాజులు తెలిపారు.ఈ కార్యక్రమ నిర్వాహణకు రాష్ట్ర ప్రతినిధులుగా రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ క్రాంతికుమార్,రాష్ట్ర కార్యదర్శి కంచర్ల మహేందర్,గౌరవ సలహాదారులు డి.నీలాంబరి పాల్గొన్నారు.మహిళా ఉద్యోగులు అత్యధిక సంఖ్యలో పాల్గొని సమ్మెకు సంఘీభావం తెలిపారు.
సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ చంద్రశేఖర్, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, మహిళా కార్యదర్శి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ వి.సావిత్రి,కోశాధికారి పుష్పలత, సాయిల్,ఉపాధ్యక్షుడు వెంకట్,జి.వెంకటేశ్వర్లు,ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు,బంటు రవి,లలిత, కొండయ్య,యాదయ్య,యాట వెంకట్,జి.వెంకటేశ్వర్లు,ధార వెంకన్న,శ్రీనివాస్,ఎర్రమల నాగయ్య,వి.రమేష్,వసంత, సుజాత,నిరంజన్, వెంకటకృష్ణ,నాగయ్య తదితరులు పాల్గొన్నారు.సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉపాధ్యాయ సంఘాలు మరియు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి.
కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగిన సమ్మెకు వివిధ ఉపాధ్యాయ సంఘాలు మరియు వివిధ రాజకీయ పార్టీలు వీరి న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం పరిశీలించి తక్షణమే పరిష్కారం చూపాలని సిపిఎం నాయకులు మాజీ ఎంఎల్ఏ జూలకంటి రంగారెడ్డి,టిఆర్ టియు జిల్లా ప్రధాన కార్యదర్శి తరాల పరమేష్,ఎంఈఎఫ్ జిల్లా సాంస్కృతిక కార్యదర్శి చింత మధు,తెలంగాణ జన సమితి నాయకులు పన్నాల గోపాల్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్,ఎస్టియుటిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్,జిల్లా అధ్యక్షులు కె.వీరరాఘవులు, వాలుగొండ సత్యనారాయణ, డా.టీ భానుప్రకాష్ గౌడ్ హాజరై మద్దతు తెలిపారు
.