సూర్యాపేట జిల్లా:జిల్లాలోని హైవే పరిధిలో ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో జిల్లా పరిధిలోని హైవే ప్రమాదాల నివరణపై చేపడుతున్న పనులపై జిల్లా ఎస్పి రాజేంద్రప్రసాద్, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ లతో కలసి సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిధిలో గుర్తించిన 29 సమస్యాత్మక ప్రాంతాలను,ముఖ్యంగా సూర్యాపేట పట్టణ పరిధిలోని టేకుమట్ల,పిల్లలమర్రి,అంజనాపూరి కాలనీ,జనగామ క్రాస్ రోడ్,కొత్త వ్యవసాయమార్కెట్, ఈనాడు ఆఫీస్ ఎదురుగా అలాగే కోదాడ ప్రాంతంలోని మాధవవరం,మొద్దులచెరువుస్టేజి, మునగాల పి.ఎస్,ఆకుపాముల బై పాస్, ముకుందాపురం యూ టర్న్ లలో సత్వరమే పనులను చేపట్టాలని అలాగే మిగతా పనులను జూలై మాసంతానికి పూర్తి చేయాలని ఆదేశించారు.పట్టణంలోని హైవే రోడ్లకు ఇరువైపులా సర్వీస్ రోడ్లు చేపట్టాలని,ప్రజా రవాణా వ్యవస్థలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
జాతీయ రహదారుల శాఖ,జి.ఎం.ఆర్ సంస్థలు నిరంతరం హైవేపై పెట్రోలింగ్ చేపట్టాలని,అలాగే కొన్ని చోట్ల లైటింగ్ సిస్టం సరి చేయాలని ఆదేశించారు.సమస్యాత్మక ప్రాంతాలలో స్పీడ్ బ్రేకర్స్,రబ్బర్ స్టట్స్,సైన్ బోర్డ్స్,పవర్ బ్లింకింగ్ లైట్స్ పనులను చేపట్టాలని,అలాగే పోలీస్ శాఖ బుల్లెట్ పిట్టింగ్స్,బారికేడ్స్,స్పీడ్ గన్స్ ఏర్పాటు చేయాలని, దీనికోసం నియమించిన కమిటీలు సమన్వయంతో కలసి పనిచేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆర్టీవో వెంకటరెడ్డి,జీఎంఆర్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీకాంత్, ఎన్.హెచ్.ఏ అధికారి విజయ్,ఇన్స్పెక్టర్లు వెంకటయ్య,వీరేంద్ర నాయక్,శ్యామ్ ప్రసాద్,అశోక్ కుమార్,ఈఈ యాకుబ్,ఈఈ పి.ఆ.ర్.తదితరులు పాల్గొన్నారు.